నేరాలు

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి

118 Views

-తిమ్మాపూర్ సీఐ స్వామి

(తిమ్మాపూర్ మార్చి 18 ది క్రైం న్యూస్ )

తిమ్మాపూర్ రాజీవ్ రహదారి నుండి తిమ్మాపూర్ గ్రామం వరకు సాయుధ బలగాలతో కవాతును నిర్వహించిన సీఐఎస్ఎఫ్ విక్రాంత్ షాకీన్,తిమ్మాపూర్ సీఐ స్వామి.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…

వాట్సాప్ ఫేస్బుక్ లలోఅసభ్యకరమైన,రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అని అన్నారు.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల ను కూడా బాధ్యులను చేస్తామని,కులం, మతం పేరుతో పోస్టులు పెడితేచట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు..

రానున్న పార్లమెంటు ఎలక్షన్లలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయ పార్టీలు గాని వ్యక్తులు గాని, ఓటర్లను బెదిరించడం గాని,మభ్యపెట్టడం గాని చేసినట్లయితే అట్టి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని ఫిర్యాదు దారుని వివరాలను గోప్యంగా ఉంచుతామని తిమ్మాపూర్ సీఐ స్వామి, తెలిపారు

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ రాజు,తిమ్మాపూర్ ఎస్ఐ చేరాలు, పోలీస్ సిబ్బందితో పాటు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్