ప్రాంతీయం

రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

95 Views

తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి)మార్చి18

  • మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లోని  విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో రజకుల సంఘం అధ్యక్షులు వరిపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ రజకులు అణగారిన వర్గానికి చెందినవారు. వీరిని ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని గత ప్రభుత్వం గత పాలకులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేసి ఓట్లు దండుకొని వెళ్లిపోయారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజక సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమైన అన్నారు. వెంటనే రజక సామాజిక వర్గాన్ని గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని అన్నారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయనట్లయితే ఉద్యమ బాట పట్టి  ప్రభుత్వాన్ని గద్దె దించుమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వరిపల్లి వెంకన్న,రత్నపురపు యాకయ్య,శీను తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్