రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామానికి చెందిన ఓ స్వర్ణకారుడు గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. గజ సింగవరం గ్రామానికి చెందిన శ్రీపాద ఆంజనేయులు (50) అని వ్యక్తి స్వర్ణకారువృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఎడావిడిగా స్వర్ణకార వృత్తి చేస్తుండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన భార్య సంధ్య వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాలని వైద్యులు తెలపడంతో బోరున విలపించింది. మృతునికి సంతానం లేదు.
