(తిమ్మాపూర్ మార్చి 17)
కరీంనగర్ జిల్లా శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సూడా) చైర్మన్ గా నియమించబడి మొదటిసారిగా కరీంనగర్ కు వస్తున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి నాయక్, వేల్పుల మధు యాదవ్,బొంగని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..