-భూమి అక్రమ పట్టా చేసుకొని భూమిని ఆక్రమించే ప్రయత్నం చేసి కుల పేరుతో దూషించిన ఎంపీటీసీ కోడె అంతయ్య ను రిమాండ్ కి తరలింపు:సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.
రాజన్న సిరిసిల్ల మార్చ్17:
ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…తంగళ్ళపల్లి మండలంలోని గట్టుపల్లి భీమవ్వా అనే మహిళా పేరుతో ఉన్నటువంటి భూమిని ధరణి సమయంలో తంగాలపల్లి కి చెందిన ఎంపిటిసి కోడే అంతయ్య అనే వ్యక్తి తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిని ఖాళీ చేయాలని భూమి లోకి అక్రమంగా ప్రవేశించి కులం పేరుతో దూషించినాడని ఫిర్యాదురాలు భూమవ్వ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో అంతయ్య పై కేసు నమోదు చేసి కోడే అంతయ్య అనే వ్యక్తిని రిమాండ్కు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై,జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడుతు ప్రజలని బయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేసే వారి నేర ప్రవృత్తి ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో,డిఎస్పీ కార్యాలయంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేయవచ్చని వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులు నేరుగా సంప్రదించాలని ఆయన కోరారు.
