ప్రాంతీయం

గుర్తుతెలవని యాచకుడు మృతి

101 Views

తెలుగు 24/7 న్యూస్ తొర్రూరు ప్రతినిధి మార్చి 17

 

మున్సిపల్ కమిషనర్ పి శాంతి కుమార్

 

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఓ యాచకుడు మృతి చెందిన సంఘటన తొర్రూరు మున్సిపాలిటీలో ఆదివారం చోటుచేసుకుంది గత 2 నెలలుగా ఓ యాచకుడు తొర్రూరు పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ కూలి పని సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం యాచకుడు మృతి చెందాడు అన్న విషయం తెలుసుకున్న కమిషనర్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించగా సిబ్బంది సంఘటనస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత 2 నెలల నుండి ఒక యాచకుడు తొర్రూర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ బిక్షాటన. కూలి పనికి పోతు జీవనం కొనసాగిస్తున్నాడని అన్నారు. విషయం తెలుసుకున్న మేము ఘటనాస్థలికి చేరుకుని మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్. మెడికల్ డిపార్ట్మెంట్ సహకారంతో యాచకుడి మృతదేహాన్ని తొర్రూర్ పోస్టుమార్టం సెంటర్ కు చిరునామా నిమిత్తం తరలించామన్నారు.   యాచకుడు మృతి పట్ల స్పందించిన మున్సిపాలిటీ సిబ్బందికి పోలీసు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాంజీ నాయక్. సి హెచ్ ఓ రాజ్ కుమార్. వార్డ్ ఆఫీసర్ ఆఫీసర్ దేవేందర్. బిక్షపతి. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7