ప్రాంతీయం

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి

85 Views

-ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి … రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

-మే 13 న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ

-ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ

-నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను అధికారులు నిర్వహించాలి

-ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
రాజన్న సిరిసిల్ల, మార్చి -16:
భారత ఎన్నికల సంఘం సాధారణ పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు

శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ , డిజిపి రవిగుప్తా, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పార్లమెంటు కు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ లు పి.గౌతమి, ఖీమ్యా నాయక్ లతో కలిసి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల 2024కు షెడ్యూల్ విడుదల చేసిందని, దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని అన్నారు .

దేశంలో 7 విడతల్లో పార్లమెంట్ సాధారణ ఎన్నికలు జరుగుతాయని, మన తెలంగాణలో పోలింగ్ నాలుగవ విడతలో మే 13 వ తారీఖు నాడు జరుగుతుందని, కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ఉంటుందని అన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏప్రిల్ 18న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని అన్నారు.

ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎన్నికల కోడ్) అమలులోకి వస్తుందని, 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, నాయకుల ఫోటోలు , వాల్ రైటింగ్స్ తొలగించాలని, 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించాలని, ప్రైవేట్ స్థలాలో ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్, జిల్లా వెబ్ సైట్ లలో మంత్రుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటో లను తొలగించాలని అన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతులు నిబంధనల ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జారీ చేయాలని ఆయన సూచించారు.

ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, జిల్లాలలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనీఖీలు నిర్వహించాలని, ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదు ఎవరు ఎన్నికల దృష్ట్యా తీసుకోని వెళ్ళవద్దని అన్నారు.

ఎన్నికల సందర్భంగా నిర్వహించే తనిఖీలలో నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, సదరు జప్తు పై ఎక్కడ ఆపిల్ చేయాలో ఆ వివరాలు రసీదులో నమోదు చేయాలని అన్నారు. ఈ 50వేల నుంచి పది లక్షల రూపాయల వరకు జరిగిన జప్తు సోమ్ము కు సరైన ఆధారాలు జిల్లా గ్రీవెన్స్ కమిటీ దగ్గర ప్రవేశపెడితే విడుదల చేయాలని , 10 లక్షలకు మించి జరిగిన జప్తు వివరాలు ఐటి శాఖకు అప్పగించాలని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదే రోజు అందించే విధంగా ఎంసిఎంసి పని చేయాలని అన్నారు. శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్ లు ప్రతి రోజూ సమర్పించే విధంగా జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.

మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడం పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని తెలిపారు.

రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని , ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.

ఎన్నికల నిర్వహణ సందర్భంగా సామాజిక మాధ్యమాలలో ఎన్నికల యంత్రాంగం పై అపోహలు సృష్టించేలా వచ్చే ఫేక్ న్యూస్ లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి ఖండించాలని అన్నారు* ఎన్నికల యంత్రాంగంపై నమ్మకం కోల్పోయే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ,* ఎన్నికల కోడ్ నియమ నిబంధనలపై అన్ని రాజకీయ పార్టీల కు సమాచారం అందించాలని, జిల్లా వెబ్సైట్లు వివిధ ప్రభుత్వ వెబ్సైట్లో ముఖ్యమంత్రులు మంత్రుల ఫోటోలు తొలగించాలని అన్నారు.

సువిధా యాప్ ద్వారా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిబంధనల ప్రకారం సకాలంలో రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని అన్నారు.

జిల్లాలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే సంబంధిత బృందాలకు సమాచారం అందించే పరిష్కరించేలా చూడాలని అన్నారు. సీజ్ చేసిన డబ్బు, ఇతర ఆభరణాలు 7 రోజుల కంటే ఎక్కువ గ్రీవెన్స్ కమిటీ వద్ద ఉండవద్దని, సంబంధిత వ్యక్తులు ఆ నగదుకు ఆధారాలు సమర్పించకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని అన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7