-ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు
-కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
-గంట ముందే చేరుకోవాలి
సిరిసిల్ల, మార్చి 16, 2024 :
ఎల్లుండి నుంచి సోమవారం (ఈ నెల 18)వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లా లోని 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
-35 కేంద్రాల్లో పరీక్షలు..
పదో తరగతి పరీక్షలకు మొత్తం 6475 మంది విద్యార్థులు హాజరుకానుండగా, బాలురు 3080, బాలికలు 3395 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో డ్యూయల్ డెస్క్ లు, తాగునీరు, టాయిలెట్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ ఇతర సౌకర్యాలు కల్పించారు. జిల్లాలో 35 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కుసుమ రామయ్య జడ్పీ హైస్కూల్ (బాయ్స్) సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ వెంకంపేట సిరిసిల్ల, విజ్ఞాన వర్ధిని హైస్కూల్ సిరిసిల్ల, సిద్దార్థ ఇంగ్లిష్ మీడియం, పత్తిపాక వీధి సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (బాలికల) ఏ, సిరిసిల్ల,
జడ్పీ హైస్కూల్ (బాలికల) బీ, సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ నెహ్రునగర్, సిరిసిల్ల, జడ్పీ హైస్కూల్ (వొకేషనల్) తంగళ్ళపల్లి, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సిరిసిల్ల, తంగళ్ళపల్లి, జడ్పీ హైస్కూల్ చందుర్తి, జడ్పీ హైస్కూల్ రుద్రంగి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇల్లంతకుంట, జడ్పీ హైస్కూల్ (వొకేషనల్)ఇల్లంతకుంట, జడ్పీ హైస్కూల్ గాలిపెల్లి, జడ్పీ హైస్కూల్ జిల్లెల, జడ్పీ హైస్కూల్ లింగన్నపేట్, గవర్నమెంట్ హైస్కూల్ వేములవాడ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వేములవాడ, గౌతం హైస్కూల్ వేములవాడ, జడ్పీ హైస్కూల్ (బాలికల) వేములవాడ, కిడ్స్ కాన్వెంట్ హైస్కూల్ వేములవాడ, హంసిని హైస్కూల్ వేములవాడ, జడ్పీ హైస్కూల్(బాయ్స్) గంభీరావుపేట్ (వొకేషనల్), జడ్పీ హైస్కూల్(బాలికల) గంభీరావుపేట్, జడ్పీ హైస్కూల్(బాయ్స్) ముస్తాబాద్, జడ్పీ హైస్కూల్(బాలికల) ముస్తాబాద్ (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ ఎల్లారెడ్డిపేట (వొకేషనల్), విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం ఎల్లారెడ్డిపేట, జడ్పీ హైస్కూల్ వీర్నపల్లి (వొకేషనల్), టీఎస్ మోడల్ స్కూల్ కోనరావుపేట, జడ్పీ హైస్కూల్ కోనరావుపేట (వొకేషనల్), జడ్పీ హైస్కూల్ ధర్మారం, జడ్పీ హైస్కూల్ బోయినపల్లి(వొకేషనల్), జడ్పీ హైస్కూల్ విలాసాగర్ గ్రామాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
144 సెక్షన్ అమలు..
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12,30 గంటల వరకూ జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
-పర్యవేక్షణకు బృందాలు..
పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు 35, డిపార్ట్ మెంటల్ అధికారులు 35, రూట్ ఆఫీసర్స్ 8 మంది, వెహికల్ ఇంచార్జీ, సిట్టింగ్ స్క్వాడ్ ఐదుగురు, ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు టీంలు, 372 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఐదు మానిటరింగ్ బృందాలు రోజు రెండు మండలాల్లో కేంద్రాల్లో పరిశీలిస్తాయి.
-హెల్ప్ లైన్ ఏర్పాటు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేపథ్యంలో హైద్రాబాద్ లో నందు 94414 40849 హెల్ప్ లైన్ ఏర్పాటు
ఏర్పాటు చేశారు. విద్యార్ధులు అలాగే వారి తల్లిదండ్రులు పరీక్షకు సంబంధించి సందేహాలు ఉన్నా ఉ॥ 10:00 గం||ల నుండి సా॥ 5:00 గ॥ల వరకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
-పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. పరీక్షా సమయనికంటే ముందే చేరుకోవాలి.
– రమేశ్ కుమార్, జిల్లా విద్యాధికారి





