-వయోజనులందరికీ అక్ష్యరాస్యతపై అవగాహన కల్పించాలి : అదనపు కలెక్టర్ పి.గౌతమి
రాజన్న సిరిసిల్ల, మార్చి -16:
జిల్లాలో ఉన్న వయోజనులందరికీ న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.గౌతమి ఆదేశించారు.
శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలు చేసేందుకు నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించాలని విద్యాశాఖ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. 15 సంవత్సరాల పైబడిన వయోజనులందరికీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, బేసిక్ ఎడ్యుకేషన్, క్రిటికల్ స్కిల్స్, కంటిన్యూ ఎడ్యుకేషన్ అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మొదటగా లబ్ధిదారులను గుర్తించి, ఈ సంవత్సరం జిల్లాలో 14 వేల 580 వయోజనులకు ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అదనపు కలెక్టర్ కు తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో ఉమారాణి, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ జయ శంకర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డీఆర్డీఓ శేషాద్రి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, తదితరుల పాల్గొన్నారు.
