సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం మహాత్మా గాంధీ 75 వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్, ఐ వీ ఎఫ్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అంగడి బజార్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో పూల మాలలు వేయడం జరిగిందని మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం తో భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం అహింస మార్గం లో విదేశీ కబంధ హస్తాల నుంచి భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ప్రతి ఒక్కరూ వారు చూపిన బాటలో నడవాలని ముఖ్యంగా చెడు అనవద్దు,చెడు కనవద్దు,చెడు వినవద్దు అని గొప్ప సందేశం ఇచ్చిన మహా నాయకుడు మహాత్మా గాంధీ అని అన్నారు ఈకార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది బిక్షపతి,మాజీ వైస్ ఎంపీపీ అత్తెళ్లి లక్ష్మయ్య,గజ్వేల్ ఫర్టీలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు భద్రయ్య, శ్రీహరి, కొమరవెళ్ళి శంకరయ్య,నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, నాగేంద్రం, సిద్దిపేట శ్రీనివాస్, కొమరవెళ్ళి శేఖర్, సిరిపురం సత్యనారాయణ, బచ్చు రవి, కొమర వెళ్ళి కళాధర్, సిద్ది నవీన్, కైలాస ప్రశాంత్,వెంకటేశ్,ఉమేష్,మహేందర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు
