బొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు
అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..?
ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు
1)మొడుసు బుచ్చిరెడ్డి (56) తండ్రి చంద్ర రెడ్డి*
2) చల్ల కిష్టారెడ్డి (40) తండ్రి బాల్రెడ్డి*
3) ముత్యాల చంద్రారెడ్డి (45) తండ్రి రాజిరెడ్డి బరిలో ఉన్నారురాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు రెడ్డి సంఘంలో నిర్వహించారు, ఇట్టి రెడ్డి సంఘం అధ్యక్షుని పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుందని తెలియజేశారు, ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అభ్యర్థులు నామినేషన్లు ముగ్గురు అభ్యర్థులు వేయగా… 1)మొడుసు బుచ్చిరెడ్డి, 2)చల్ల కిష్టారెడ్డి, 3) ముత్యాల చంద్రారెడ్డి బరిలో ఉన్నారు, 21న నామినేషన్లు పరిశీలించారు, 22వ తేదీన నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇవ్వగా నేడు 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి రెడ్డి సంఘంలో ఎలక్షన్లు నిర్వహించారు, మధ్యాహ్నం ఒకటి గంటల వరకు సంఘం సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు, దీని ప్రకారమే సంఘం యొక్క సభ్యులు ఉదయం 8 గంటల నుండి తమ ఓటును వినియోగించుకుంటున్నారు, మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓట్ల లెక్కింపు పరిశీలించి అత్యధిక ఓట్లు సంపాదించుకున్న వ్యక్తిని రెడ్డి సంఘం అధ్యక్షునిగా ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు
