ముస్తాబాద్, డిసెంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ని గెలిపించినందుకు మండల బీఆర్ఎస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకుడు సంపత్ రెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేటీఆర్ కి మెజారిటీ ఓట్లు వేసి 5 వసారి ఎమ్మెల్యే గా గెలిపించడంలో మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ఉంటామని అన్నారు. ఈకార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
