ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి ఇద్దరికి గాయాలు
సిద్దిపేట జిల్లా జూన్ 10
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంపంతులు తండా గ్రామానికి చెందిన భార్యాభర్తలు రాజు స్వరూప మరియు రాజు మరదలు కవిత ముగ్గురు కలిసి కూలీ పనుల నిమిత్తం పంతులు తండా నుండి ఉదయం అక్కని పేటకు వస్తున్న క్రమంలో హుస్నాబాద్ నుండి జనగాం వెళ్తున్న హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ముగ్గురిలో కవిత అక్కడికక్కడే చనిపోయింది భార్యాభర్తలైన రాజు స్వరూప లలో స్వరూపకు సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ తరలించారు రాజుకు రెండు కాళ్లు విరిగిపోయాయి చనిపోయిన కవితకు ఇద్దరు కుమారులు కాగా స్వరూప రాజుకు కుమారుడు కుమార్తె ఉన్నారు దీంతో కూలినాలి చేసుకునే రెండు కుటుంబాలలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి
