వర్గల్ మండల్, మైలారం గ్రామం మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :మైలారం గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ప్రధానోఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల ద్వారా పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది.
మరియు దాతలు షావకు సత్యనారాయణ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. గ్రామ పెద్దలు పిల్లల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటిదని భావితరాలకు ఇన్స్పిరేషన్ గా మీరు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా 10/10 జిపి సాధించాలని మైలారం గ్రామం నుండి 100% రిజల్ట్ తీసుకురావాలని వివరించడం జరిగింది.
10/10 జిపి సాధించిన వారికి పదివేల రూపాయలు ప్రైజ్ మనీ మరియు తల్లిదండ్రులకు శాలువాతో సన్మానం చేస్తామని షావకు సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. ఇందులో మాజీ సర్పంచ్ మంజుల కృష్ణ, కనకయ్య, ప్రభాకర్, సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.