ప్రాంతీయం

వేలాలను సందర్శించిన రామగుండం సిపి

67 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

వేలాల మల్లికార్జున స్వామి ఆలయం సందర్శించిన రామగుండం సీపీ.

రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్.,(ఐజి) జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామి ని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్,ఐపిఎస్., ఏసీపీ జైపూర్ వెంకటేశ్వర్లు లతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖ ల సమన్వయం తో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకి వచ్చిన భక్తులు బోనాలు వండి దీపాలు పెట్టడం జరిగింది. చుట్టూ ఎండిన గడ్డి ఎండిన ఆకులు ఉన్నాయి కావున అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉంది గనుక జాగారం ఉండేవారు తప్పకుండా తెలివితో ఉండి దీపాలను గమనిస్తూ ఉండాలని సిపి గారు భక్తులకు ప్రజలకు సూచించారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి వరుస పద్ధతిలో అనుమతించడం జరిగిందని, దర్శనం కి వచ్చి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ప్రజలు, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుని శీఘ్ర దర్శనం జరిగింది అని ఒక మంచి అనుభూతి తో ఆనందం గా వెళ్లేలాగా అని అధికారులకు సూచించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్వహించడం జరిగింది అని తిరిగి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని అధికారులకు సూచించారు అన్నారు.

 

ఈ కార్యక్రమం లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీరాంపూర్ బన్సీ లాల్, ఎస్ఐ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్