అంజనీ పుత్ర ఆధ్వర్యం లో మజ్జిగ పంపిణీ.
అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వేలాల లోని గట్టుమల్లన్న స్వామి సన్నిధిలో దైవ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో 5వేల మందికి మజ్జిగ పంపిణీ నిర్వహించారు.
అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎండీ పిల్లి రవి ముఖ్య అతిథి లుగా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినాన పరమ శివుని కరుణా కటాక్షం ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని,రైతులు పాడిపంటలు కలిగి విలసిల్లాలని పేర్కొన్నారు.అనంతరం వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకుని శివ లింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటవ్ డైరెక్టర్ లు కిషన్ ,సంతోష్, డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
