ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పాత్ర గొప్పదని కొనియాడారు .మహిళలు సమాజంలో గొప్ప స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించి శాలువాతో సత్కరించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మావతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
