24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మార్చ్ 3)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మరియు పాములపర్తి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ , జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నివారణ కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ఎన్ని పనులు ఉన్నా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం మరువద్దని, నిండు జీవితానికి రెండు చుక్కలు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మర్కుక్ తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్,నాయకులు, డాక్టర్లు, ఏఎన్ఎం లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
