రాజకీయం

గొర్రెల పంపిణీ కార్యక్రమం

149 Views

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16

ఈరోజు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పల్లెపహడ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలకు అందిస్తున్న గొర్ల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు పల్లె పహాడ్ గ్రామానికి వచ్చిన 14 యూనిట్లను గొల్ల కురుమలకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి  ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ గొల్ల కురుమల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి కాంతుల నింపారన్నారు, కూలీలను యజమానులుగా మార్చిన పథకం గొర్రెల పంపిణీ పథకం అన్నారు, భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడ లేదన్నారు, గొర్రెల పంపిణీ పథకంతో లక్షలాదిమంది కి లబ్ది జరిగింది అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల సంపద విపరీతంగా పెరిగిందన్నారు, గతంలో ఇతర రాష్ట్రాల నుండి గొర్లను దిగుమతి చేసుకునే వారమని కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు, గొర్ల పంపిణీ పథకంతో గొల్ల కురుమలు తలెత్తుకొని జీవిస్తున్నారన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల యొక్క రూపురేఖలు మార్చారన్నారు, కుల వృత్తుల వారికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. కుల వృత్తులకు అందిస్తున్న ఆర్థిక తోడ్పడుతో గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయన్నారు, ఈ కార్యక్రమంలో వర్గల్ జెడ్పిటిసి బాలు యాదవ్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా,కిషన్ రెడ్డి, అఖిల భారత యాదవ మహాసభ గజ్వేల్ అధ్యక్షుడు ఎక్కల దేవి కనకరాజ్ యాదవ్, ఉపాధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరేష్ యాదవ్, యూత్ ప్రెసిడెంట్ లింగం యాదవ్, నర్సింలు యాదవ్,గ్రామ సర్పంచ్ గుగ్లోత్ చిన్నా రజిత, గోవింద్,ఉప సర్పంచ్ లలిత నాగరాజు, ఎక్స్ జెడ్పిటిసి రాములు, పల్లె పహాడ్ యాదవ సంఘం నాయకులు కొమ్ము బాబు యాదవ్,కొమ్ము ఎల్లయ్య,కనకయ్య , కృష్ణ,నాగరాజు యాదవ్,అరుణ్, ఆంజనేయులు కొమురయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *