అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ అధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ
మార్చ్ 2
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అమరవీరుల దినత్సవ సందర్భంగా సిద్దిపేట
శాఖ అధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమరవీరుల ను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ పేరాల శేఖర్ మాట్లాడుతూ “దేశం కోసం ఎందరో బలిదానమైనప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జాతీయ జెండా గౌరవం కాపాడడం కోసం నిరంతరం విద్యార్థుల సమస్యల పట్ల పోరాడుతున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అతి కిరాతకంగా హత్యలు చేసినప్పటికీ ఏబీవీపీ 24 కార్యకర్తలు దేనికి బెదరకుండా పోరాడుతూ జాతీయతనే ఊపిరిగా ముందుకుతున్న ఏదైనా ఉంది అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సైనికులకు మాత్రమే ఇచ్చే చక్ర అవార్డులను దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు కూడా గత ప్రభుత్వాలు చక్ర అవార్డులు ఇచ్చాయి, అలాగే స్వాతంత్రం అనంతరం జాతీయ జెండా కోసం ప్రాణాలొడ్డిన కాకతీయ యూనివర్సిటీ కార్యకర్త సామా జగన్మోహన్ రెడ్డి లాంటి కార్యకర్తలు ఎందరో ఈ దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేశారని అన్నారు.
అలాగే మెదక్ విభాగ్ సంఘటన కార్యదర్శి లక్ష్మణ్ మరియు సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ జాతీయ వాద సిద్ధాంతం కోసం పరితపిస్తూ అహరహం కృషి చేస్తూ విద్యార్థులకు చేరువై యూనివర్సిటీ, కళాశాల క్యాంపస్ లలో జాతీయవాదం విస్తరిస్తున్న క్రమంలో నరహంతక నక్సల్ రాడికల్స్ చేతిలో దేశం కోసం ప్రాణాలర్పించిన 40 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు విద్యార్థులు అందరు ఘన నివాళి పలకాలని తెలియజేశారు అలాగే ఈ దేశంలో జాతీయ వాదం కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏకైక సంఘం ఏబీవీపీ అని ఏబీవీపీ కార్యకర్తలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంఘటన మంత్రి లక్ష్మీపతి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదిత్య,నగర కార్యదర్శులు హరీష్,రాకేష్, జిల్లా వివిధ అయమాల కన్వీనర్లు ప్రణయ్,చరణ్, నగర బాధ్యులు పర్షారం ,కౌశిక్,భీమన్న, రాహుల్ , ఏబీవీపీ పూర్వ ,ప్రస్తుత కార్యకర్తలు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.





