Breaking News

గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి

166 Views

గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి

సిద్దిపేట జిల్లా గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిపైనా దాడులకు తెగబడుతున్నాయి. పిక్క కనిపిస్తే చాలు కుక్కలు రెచ్చిపోతున్నాయి తాజాగా సిద్దిపేట కలెక్టరేట్‌లో కుక్కలు బీభత్సం సృష్టిస్తుంచాయి. ఏకంగా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. కలెక్టర్‌ పెంపుడు శునకమూ తీవ్రంగా గాయపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సిద్దిపేట శివారులో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాసాలు ఉన్నాయి శనివారం రాత్రి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్‌ ఆవరణలో వాకింగ్‌ చేస్తుండగా ఓ వీధి కుక్క కరిచింది ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచి పరిశీలనలో పెట్టారు మరో వీధికుక్క అదేరోజు రాత్రి ఇంకో వ్యక్తిని, కలెక్టర్‌ పెంపుడు శునకాన్ని కరిచింది. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. దాంతో అధికారుల కుటుంబాల సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *