గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం లో గురువారం సంఘం అధ్యక్షులు తలకొక్కుల.దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం జిల్లా పాలకుర్తి మండలం లోని చెన్నూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక రేగొండ సంగీత దొంగతనం చేసిన నేరము మోపి అదే గ్రామానికి చెందిన పెత్తందారులు అగ్రకులాల వాళ్లు మరియు ప్రభాకర్ రావు,అతని అనుచరులు కలిసి అమ్మాయి మీద దొంగతనం నెరం మోపి తాళ్లతోచెట్టు కట్టేసి, కళ్ళలో కారం చల్లి చిత్రహింసలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, రాజకీయ నాయకులు దృష్టి సారించి అమ్మాయిపై నిందలు మోపి చిత్ర హింసలు చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే అరెస్టు చేయాలని తీర్మానం చేశారు, లేని యెడల రాష్ట్ర ఉద్యమానికి తెర లేపడం జరుగుతుందని పద్మశాలి సమాజానికి కీడు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షులు గాడి పల్లి శ్రీనివాస్, తుమ్మ శ్రీనివాస్, సూరం లింగం, రాజేశం, ఆడెపు బాలచంద్రం, పేర్ల శ్రీనివాస్, గుండు.లక్ష్మణ్, గాడిపల్లి బలరాం, మంగళపల్లి సత్యనారాయణ,రాజారాం, పెండెం వెంకటేష్, గుండు శ్రీధర్, విజయ్ కుమార్, పద్మశాలి యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, రమేష్, చంద్రశేఖర్, సదానందం, మెరుగు శ్రీను, కృష్ణ, పోశెట్టి వెంకటేశం, మరియు కుల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు