రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముస్తాఫానగర్ గ్రామసర్పంచ్ కొక్కు సంధ్యా రాణి యాదవ్ కు సర్పంచ్ భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ప్రొసీడింగ్ నెంబర్ 2/786/2022 ప్రకారం విధుల్లో చేరాలని ఉత్తర్వులు జారీచేస్తు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జారీచేశారు.తనకు రావలసిన పెండింగ్ బిల్లులు స్మశానవాటిక ,కంపోస్టు షెడ్,డంపింగ్ యార్డ్ బిల్లులు సుమారు 50 లక్షల రూపాయలు రావాల్సిన విషయం పై అధికారులనుప్రశ్నించగా ,పెండింగ్ బిల్లులు ఇవ్వకపోగా పైగా సస్పెన్షన్ జిల్లాకలెక్టర్ సస్పెన్షన్ వేటువేశారు.దీనిని సవాల్ చేస్తూ సంధ్యారాణి యాదవ్ తననుఅకారణముగా సస్పెన్షన్ విధించారని హైకోర్టు ను ఆశ్రయించారు.దీంతో తిరిగి సర్పంచ్ భాద్యతలు అప్పగించాలనిసెప్టెంబర్ 29 న హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను అధికారులు కాలయాపన చేస్తూ నేడు సర్పంచ్ గా విధుల్లో చేరాలని జిల్లా కలెక్టరేట్ అనురాగ్ జయంతిఉత్తర్వుల కాపీని అందజేశారు.తమ యాదవ జాతి ఆడపడుచు సర్పంచ్ గా కొనసాగుతుండగా అకారణంగా సస్పెన్షన్ విధించారని పేర్కొంటూ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేకల రాములు యాదవ్,యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అసరి బాలరాజ్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏ టి యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఒగ్గు బాలరాజు యాదవ్ , వీరవేని మల్లేశం యాదవ్,వాసం మల్లేశం యాదవ్,ముడికే చంద్రశేఖర్ యాదవ్,జడల శ్రీనివాస్ యాదవ్,మిరాల శ్రీనివాస్ యాదవ్, కుర్మ సంఘము జిల్లా అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య యాదవ్,యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జడల దిలీప్ యాదవ్,బీఎస్పీ,బిసి సేన నాయకులు బట్టు ప్రవీణ్ ల ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వం పనితీరును ప్రశ్నిస్తూ పలు రకాలుగా ఆందోళన చేశారు.తిరిగి సర్పంచ్ గా విధుల్లో చేరనున్న కొక్కు సంధ్యారాణి యాదవ్ ను యాదవ సంఘ రాష్ట్ర ,జిల్లా నాయకులు అభినందించారు.తనకోసం పోరాటం చేసిన యాదవ సంఘ రాష్ట్ర,జిల్లానాయకత్వంనకు,బీఎస్పీ ,బిసి సేన నాయకులకు మద్దతు ఇచ్చిన ప్రతిఒక్కరికి సర్పంచ్ దంపతులు కొక్కు సంధ్యారాణి యాదవ్,కొక్కు దేవేందర్ యాదవ్ లు కృతజ్ఞతలు తెలిపారు.
