132 Views
- దుబ్బాక / రాయపోల్
ప్రజాకలం ప్రతినిధి
నవంబర్ 08.సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం కూలి పనుల కోసం పొలం పనులకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలు చింతకింది కవిత కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు, ఇప్ప శ్యామల కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అదే రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై వైద్యం కోసం హాస్పిటల్ లో చేరిన కొంగరి రాజమణి కుటుంబం సభ్యులను పరామర్శించి వారి చికిత్స నిమిత్తం 5,000/- రూపాయలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి, భాగన్నగారి రవీందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, రాజు గౌడ్, బాసం నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found