ప్రాంతీయం

6,గ్యారెంటీలు చెప్పలేదనుకుంటా పోయేరు.. తప్పదు ఇదిగో గురువాక్యం.. తప్పిపోయే తొవ్వలోన…

306 Views
 ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 30, మండలంలోని తెర్లమద్ది గ్రామంలో కాంగ్రెస్ నాయకులు 6,గ్యారెంటీల గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6,గ్యారంటీలకు ప్రజల నుండి విశేషంగా ఆదరణ లభిస్తుంది దాన్నిచూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపు గ్యారెంటీ అని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు 24,గంటల కరెంటు ఇచ్చిన విషయం రైతులకు తెలవదా అన్నారు. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత 9,గంటల విద్యుత్తును లక్ష రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ మరియు సబ్సిడీలో రైతులకు కావలసిన పరికరాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే అన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తూ రైతు కూలీలకు 12,వేల రూపాయలు మరియు రైతులకు 15,వేల రూపాయల వరకు రైతు భరోసా ఇస్తాము అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ఘనత నెరవేర్చే దమ్ము కాంగ్రెస్ కే ఉంది అన్నారు. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెన్షన్లు ఇవ్వలేని బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ద్వారా పేపరు లీకేజీ చేసి 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి టిఎస్పిఎస్సి లీకేజ్ తో నాకేం సంబంధం లేదు అన్న తారక రామారావు ఈరోజు టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తాము అనడం హాస్యాస్పదం అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ ని బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ గెలుపు తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, తెర్లుమద్ది గ్రామశాఖ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తలారి నర్సింలు, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, చికోడు గ్రామశాఖ అధ్యక్షులు బుగ్గ రమేష్, మండల ఉపాధ్యక్షులు తాడెపు కొమురయ్య, సీనియర్ నాయకులు వెలముల రాంరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *