దౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్పిఓ మల్లికార్జున్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్, ఇందుప్రియాల్ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, డాక్టర్లు నాగరాజు, ఆశ్లేష, ఎంపీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు…




