*చిన్నారిని కాపాడిన బిఅర్ఎస్ పార్టీ 10 వ వార్డు జనరల్ సెక్రెటరిని సన్మానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే*
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం దాదాపు 7 గంటల 30 నిమిషాల సమయంలో కాసిపేట మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళ, జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని రక్ష హోమ్స్ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిని ,ఆ మహిళ తనతోపాటు తీసుకెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న ఆశీర్వాద్ విల్సన్ గారు ఆ చిన్నారి ఏడవడం గమనించి అనుమానంతో ఆ మహిళను ఆపి ఆరా తీయగా ,ఆ పాప ఏడుస్తూ ఆ మహిళ ఎవరో తనకు తెలియదంటూ,నన్ను బలవంతంగా తీసుకెళ్తుంది, అని చెప్పడంతో ఆ మహిళను ఆపి, చిన్నారి తల్లిదండ్రులకు,స్థానికులకు సమాచారం అందించడంతో ఆ మహిళకు దేహశుద్ధి చేశారు…
అనంతరం తమ కూతురిని కాపాడిన ఆశీర్వాదం విల్సన్ కి చిన్నారి తల్లితండ్రులు అభినందనలు తెలిపారు..
ఈ కిడ్నాప్ చిన్నారిని కాపాడిన విషయం తెలుసుకున్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. ఈ రోజు ఆశీర్వాదం విల్సన్ శాలువాతో సత్కరించడం జరిగింది..
