రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగం వెలకట్టలేనిది.
ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగా
ఘనంగా 127వ రమాబాయి అంబేద్కర్ జయంతి
ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 07 :
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత సహచరిగా, ఆయన జీవితంలో, భారత రాజ్యాంగ నిర్మాణంలో, చేసిన ప్రతి పోరాట, హక్కుల ఉద్యమ ఘట్టాల్లో ఆమాతృమూర్తి రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ అన్నారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా బుధవారం ఆమే చిత్ర పటానికి ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,
ఈ సందర్భంగా ఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ మాట్లాడుతూ తన భర్త చదువుకు పిడకలమ్మి పస్తులుండి పైస పైసా కూడబెట్టి పంపడం ఒక భాగమైతే, తన కుమారులు కండ్ల ముంగట చనిపోతున్న ఆకడుపుకోతను, పుట్టెడు దుఃఖాన్ని కడుపున దిగమింగుకుని ఆన్ని తానై ముందుకు నడిపిన ధీశాలి అని ఆయన కొనియాడారు,
నేను చీకట్లో బతుకుతున్న రేపటి తరాలకు వెలుతురు రావాలంటే నువ్వు బాగా చదవాలి అంటూ మానసిక, కుటుంబ, ఆర్థిక, సమాజ ఇబ్బందులు తన ధరికి చెరనీయకుండ బాబాసాహెబ్ ను నడిపించిన ఆదర్శమూర్తి అని ఆయన అన్నారు,
తాను అనారోగ్యానికి గురై మరణించే పరిస్థితులు ఉన్నా కూడా ఆవిషయం తన భర్తకు తెలిస్తే కృంగిపోయి ఆశయ సాధన పోరాటానికి భంగం వాటిల్లుతుందని తెల్పకుండ మరణించేంత వరకు మన వర్గాల కోసమే తపించిన త్యాగశీలి తల్లి రమాబాయ్ అంబేద్కర్ అని అన్నారు,
తల్లి శ్రమ, చేసిన కష్టం, నేటి తరం కోసం పడ్డ తపన, అంబేద్కర్ ను నడిపిన విధానం, భర్త తోడుగా లేకున్నా ఆన్ని తానై కుటుంబాన్ని నడిపిన తీరు, ఈసమాజ అభ్యున్నతి కోసం అందించిన కృషి అంతా చారిత్రాత్మకమైనది.. నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమైనదన్నారు. రమాభాయి, అంబేద్కర్ గార్లు కలలు కన్న సమాజం కోసం, సమానతలు లేని సమాజ నిర్మాణం కోసం మహాజన నేత మాన్యశ్రీ *మందకృష్ణ మాదిగ* గారి నాయకత్వంలో శ్రమిస్తామని, వారి ఆశయాల్ని, స్వప్నాల్ని సాకారం చేసేలా అన్ని వర్గాలను ఏకం చేసి ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు,
ఈ కార్యక్రమంలో నాయకులు గద్దరాశి భగవంతం, చకినాల నారాయణ , దేవరాజు, పర్షరాములు, బాల్ రాజు , జావేద్, తదితరులు పాల్గొని నివాళులర్పించారు,
