– నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
– -రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ.
సిరిసిల్ల 07, ఫిబ్రవరి2024:
మేమే మీ బంధువులం!…..
అధైర్యపడవద్దు….నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ* భరోసానిచ్చారు.
బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా
ఆమె మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి కలిసి
సందర్శించారు. ఈ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 33 మంది వయోవృద్ధులతో ఆమె ఆత్మీయంగా పలకరించారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు. పండ్లను పంపిణీ చేశారు.
ఆరోగ్య ఎట్లా ఉంది? సమయానికి మందులు వేసుకుంటున్నారా? వైద్యులు పరీక్షిస్తున్నారా? భోజనం బాగుంటుందా?
కేంద్రంలో మౌలిక సదుపాయాలు బాగున్నాయా? సిబ్బంది బాగా చూసుకుంటున్నారా? ఆక్టివ్ గా ఉండేందుకు వాకింగ్, సులభతరమైన ఇండోర్ స్పోర్ట్స్ అడుతున్నరా ? సంతోషంగా ఉన్నారా?
అంటూ ప్రశ్నించారు.
కార్యదర్శి ఆత్మీయ పలకరింపుతో వృద్ధులు ఆనందభాష్పాలు రాల్చారు. కేంద్రంలో అన్ని సౌకర్యాలు బాగున్నాయని.. సిబ్బంది సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారని కార్యదర్శికి తెలిపారు.
ఈ వయసులో కన్నవారికి దూరంగా ఇక్కడ ఉండడం పట్ల తమ బాధను కొద్ది మంది వృద్ధులు వ్యక్తం చేశారు.
వారిని ఓదార్చిన కార్యదర్శి… చింత మానండి…మేమే మీ బంధువులం!….. నిరాదరణకు గురైన వృద్ధులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. మీకు ఏలోటు లేకుండా చూసుకుంటామని చెప్పారు.
అనంతరం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ తంగళ్ళపల్లి కేజీబీవీ సందర్శించారు.
కేజీబీవీ లో గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సౌజన్యంతో ప్రయోగాత్మకంగా అమలు అవుతున్న షేరో ( SHERO – Stembased holistic education with Right orientation) ప్రాజెక్ట్ అమలు ను కలెక్టర్ అనురాగ్ జయంతి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి పరిశీలించారు.
దీనిలో భాగంగా పిల్లలు సైన్స్ పాఠాలు, టెక్నాలజీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మొదలైన సబ్జెక్టులలో నైపుణ్యం పెంపొందించడానికి ప ప్రత్యేక పరికరాల ద్వారా అందిస్తున్న శిక్షణ తీరును, వివిధ రకాల కృత్యాలను పరిశీలించారు. విద్యార్థులను ఆ కృత్యాల ఏ విధంగా తయారు చేశారు…వాటి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
కంగ్రాట్యులేషన్….. చాలా బాగా చెప్పారు, అంటూ విద్యార్థులను కార్యదర్శి అభినందించి వెన్ను తట్టారు
మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినిలు ఆధునిక ప్రపంచంతో పోటీపడేలాగా జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రభావ వంతం గా అమలు చేస్తూ జీవన నైపుణ్యాలతో పాటు
ప్రాక్టికల్ గా పాఠాలు నేర్పించడం ఆక్టివిటీ బేస్డ్ ద్వారా విద్యను అందించడం, ప్రయోగ నైపుణ్యాలు నేర్పించడం, స్వయంగా చేసి చూపించే నైపుణ్యాలను పెంపొందించడం, ఒత్తిడి నీ ఎలా ఎదుర్కోవడం, నాయకత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి కార్యక్రమాల
వల్ల విద్యార్థినిలభవిష్యత్ కు బంగారు బాటలు వేసేందుకు దోహదం చేస్తుందని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్యామల తదితరులున్నారు.
