ప్రాంతీయం

రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేదరిపేట లో ఉచిత కంటి వైద్య శిబిరం

206 Views

రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు దండేపల్లి మండలం మ్యాదరిపెట్ గ్రామంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి వెరబెల్లి స్రవంతి జన్మదినం సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కంటి వైద్య శిబిరానికి దండేపల్లి మండలం వివిధ గ్రామాల నుండి సుమారు 400 మంది ప్రజలు హాజరై ఉచిత కంటి పరీక్షలు చేసుకోవడం జరిగింది. పరీక్షలు చేయించుకున్న వారిలో 120 మందికి కంటి శస్త్రచికిత్స అవసరం ఉండటంలో వారికి త్వరలో ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేయించడం జరుగుతుంది అని స్రవంతి తెలిపారు.

ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిరంతరంగా సేవ కార్యక్రమాలు అందుతాయని అందులో భాగంగా ఈరోజు దండేపల్లి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకోలేక చాలా మంది వృద్దులు కంటి చూపును కోల్పోతున్నారని వారి కోసం ప్రతి గ్రామంలో విడతల వారీగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు కంటి అద్దాలు మరియు అవసరం అయిన వారికి శస్త్ర చికిత్స చేపిస్తామని తెలిపారు. ప్రజలు అందరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తమ ఫౌండేషన్ అధ్వర్యంలో నిరంతరం పేద ప్రజలకు సేవ కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రతి ఒక్కరికీ ఏ అవసరం ఉన్న అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, బందేల రవి గౌడ్, డంక లక్ష్మణ్, నలిమెల మహేష్, కర్ణల కిషన్, ముత్తినెనీ మల్లేష్, లక్ష్మి నారాయణ, నందుర్క సుగుణ, గుండా రవీందర్, సత్తయ్య, మోరుటుపాల తులసి, బొద నర్సింగ్, అమృత, బత్తుల మౌనిక, చిట్లా మంజూ భార్గవి, పత్తిపాక సంతోష్, యుగెందర్, బుచ్చన్న, బెడద సురేష్, ఏర్రం నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *