విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమాజం బాగుపడుతుంది
– ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
– రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల 28, జనవరి 2024
విద్యాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
విద్యకు ప్రాధాన్యతనిస్తేనే సమాజం బాగుపడుతుందనీ…ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆదివారం బోయినిపల్లి మండలం కోరేం లో చెన్నాడి మార్తాండరావు జ్ఞాపకార్థం అతని సోదరుడు, మాజి ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు తన సొంత ఖర్చులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల.. గ్రామ పంచాయితీ కార్యాలయం తో పాటు విండో నిధులతో నిర్మించిన సింగిల్ విండో సొసైటీ నూతన భవనం. నాబార్డ్ నిధులతో నిర్మించిన 3 వందల మెట్రిక్ టన్నుల గోదామును చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం, టేస్కాబ్ ఛైర్మెన్ శ్రీ కొండూరి రవీందర్ రావు, శ్రీ చెన్నాడి సుధాకర్ రావు, సర్పంచ్ శ్రీమతి రాజ్యలక్ష్మి లతో కలిసిరాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…..
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు . ప్రజల్లో కూడా ఎంత కష్టమైన కూడా విద్యార్థులకు మంచీ విద్య అందించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు గుణాత్మక విద్యతోపాటు మౌలిక సదుపాయాల పెంపుదల చేసేలా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.త్వరలోనే రాష్ట్రంలోని భవనాలు గురుకులాలకు కొత్త బిల్డింగులను నిర్మిస్తామని చెప్పారు.
విద్యార్థులు మెస్ చార్జీలు పెంచుతామని అన్నారు.
రాష్ట్రంలో మార్పు వచ్చింది. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయం అన్నారు.
ఇటువంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయం చేస్తామని అన్నారు.
రాష్ట్రంలోని చాల మంది అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారన్నారు.
పుట్టిన ఊరు కు సేవ చేయడం చాల గొప్ప విషయం అని మంత్రి పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..
ప్రజా భాగస్వామ్యంతో చొప్పదండి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
