24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 25)
సిద్దిపేట జిల్లా:
గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ నే ప్రధమ కర్తవ్యం అన్నారు.ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృధి జరుగుతుందనీ అన్నారు.ప్రజలకు ఎల్లవేళల పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు.శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కటిన చర్యలు తప్పవు అన్నారు.
