రాజకీయం

పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం

224 Views

– బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు

– దేశంలోనే ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన

– అసత్య ప్రచారం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి మానవత్వం లేదు

దౌల్తాబాద్: పేదల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తనయుడు కొత్త పృథ్వీ కృష్ణరెడ్డి లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గువ్వలేగి, ఉప్పరపల్లి, గోవిందాపూర్, కోనాయిపల్లి, దౌల్తాబాద్, లింగరాజు పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని మహిళలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల విద్యుత్తు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో చేయలేని అభివృద్ధి కేవలం 9 ఏండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్ తో పాటు వివిధ సంక్షేమ పథకాలు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నారని పదవుల కోసం కొట్టాడటం తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకోరని ఆయన ప్రశ్నించారు. గతంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అనారోగ్యానికి గురైతే విషయం తెలుసుకొని విదేశాల్లో మెరుగైన వైద్యం చేయించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు. నాడు సీఎం కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తి అన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి నేడు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తిపోట్లను ఖండించాల్సింది పోయి ఆసక్తి ప్రచారాలు చేయడం కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులకు నీతి లేదన్నారు మీ ఆశీర్వాదంతో మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి 10 సంవత్సరాలు సేవ చేశాడని దుబ్బాక ఎమ్మెల్యేగా మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు సహకారంతో దుబ్బాకను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం దౌల్తాబాద్ మండల ముదిరాజ్ నాయకులు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లత మధుసూదన్ రెడ్డి, చిత్తారి గౌడ్, మల్లేశం గౌడ్, యాదగిరి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ కులస్తులు నర్ర రాజేందర్, నల్ల ఆంజనేయులు, నాగరాజు, వేమ శ్రీనివాస్, బండి రాజు, పోచయ్య, పోషమైన రాజు, చిక్కుడు సత్యనారాయణ, పీటర్, బొల్లి చంద్రం, పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *