Breaking News

జాతీయ ఓటరు దినోత్సవం.

76 Views

సిద్దిపేట్ జనవరి 25:జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న కోహెడ, మండలం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్

ఓటు అమూల్యమైనది.

ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి.

ఓటు హక్కును వినియోగించుకుందాం…ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం.

సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీగా రావడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కొక్కులకీర్తి సురేష్ మాట్లాడుతూ కోహెడ మండలంలోని గ్రామాల ప్రజలు 18 సంవత్సరాల పై ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఓటు ఓటర్ కార్డు లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలని గ్రామాలలో బిఎల్ఓ లను సంప్రదించాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విలువైన ఓటు హక్కును మనం ఎప్పుడూ గౌరవించాలన్న విషయాన్ని గుర్తు చేశారు. ఓటు హక్కు సాధారణ హక్కు కాదని. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన రాజ్యాంగం మతం, జాతి, కులం ఆధారంగా ఎటువంటి వివక్ష లేకుండా పౌరులందరికీ సమాన ఓటు హక్కును ఇచ్చిందని..అందుకోసం మన రాజ్యాంగ రూపకర్తలకు రుణపడి మనందరం ఉంటామని ఉండాలని జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోహెడ మండల ఏం సి చైర్మన్ తిప్పారపు జ్యోతి శ్రీకాంత్ వెంకటేశ్వర్ల పల్లె ఎంపిటిసి ఖమ్మం స్వరూప తహసీల్దార్ సురేఖ ఎంపీడీవో మధుసూదన్ డిటి రాజిరెడ్డి ఎంపీ ఓ సురేష్ కోహెడ కార్యదర్శి దేవేందర్ హెచ్ఎం మరియు హై స్కూల్ టీచర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *