గజ్వేల్ మండల్ కోమటిబండ ఫిబ్రవరి 29, 24/7 తెలుగు న్యూస్: మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత..
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, కోమటి బండ లో గుట్ట మీద వెలిసిన ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవానికి ఆహ్వాన పత్రికను గురువారం మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి అందజేసిన శ్రీ సంగమేశ్వర భజన మండలి సభ్యులు.
కోమటిబండ మాజీ సర్పంచ్ శేఖర్, గౌరారం మాజీ సర్పంచ్ పల్లె నాగుల్ గౌడ్, మరియు వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్. ఈ సందర్భంగా మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని మహా శివుని అనుగ్రహం తో అందరూ బాగుండాలని కోమటి బండ లోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్విత ఆలయం అని శివరాత్రి వేడుకలకు తప్పకుండా హాజరవుతానని, శివరాత్రి వేడుకలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు బడే మల్లేష్, తుమ్మ వెంకటేష్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు




