అయోధ్య శ్రీరామ మందిరా భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం
జనవరి 23 మెదక్ జిల్లా
చిలిపిచేడు మండలంచండూరు గ్రామంలో, హనుమాన్ టెంపుల్ లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సాయన్న వెంకటరెడ్డి, సర్కార్ నర్సింలు, గడ్డం నరేందర్ రెడ్డి,చౌటకూరి మల్లారెడ్డి, రామారాయినీ నరసింహారెడ్డి,రామరాయినీ గోవర్ధన్ రెడ్డి,గడ్డం నారి స్వామి, ఇంకా కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేశారు. సహకారంతోనే ఈనాటి ఈ పూజా కార్యక్రమం సఫలం అయ్యింది కుటుంబాలకు ఎల్లవేళలా భగవంతుని అండదండలు ఉండాలని వేడుకుంటున్నాము.
నిన్న సాయంత్రం బిజెపి మండల అధ్యక్షులు అగు ఎనిగండ్ల దశరథ్ ఇంకా రామ భక్తులు, గ్రామంలో తోరణాలు శ్రీరామ ముద్రికలు వేస్తూ గ్రామాన్ని అలంకరించారు. ఉదయం నే భక్తాదులు హనుమాన్ చాలీసా శ్రీరామ భజనలు అంగరంగ వైభవంగా చేశారు. మరియు ముంగిమల్లి పీఠాధిపతి కోట్ల ఆనందం గురుస్వామి నారాయణపేట వాస్తవ్యుల ఆశీర్వాదం చండూరు గ్రామ ప్రజలకు లభించింది.ఆధ్యాత్మిక గురువు గ్రామానికి రావడం భగవంతుని సంకల్పంగా భావించిన ప్రజలు చాలా సంతోషించారు.
శ్రీరామలింగేశ్వర భజన మండలి శ్రీ హనుమాన్ భజన మండలి వారు భగవంతుని సేవా కార్యక్రమాలలో భజనలు చేసి కీర్తనలు పాడి, శ్రీరామ స్వామివారి కృపకు పాత్రులైనారు. చండూరు గ్రామ వీధులలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామ నామాన్ని జపిస్తూ గ్రామంలో ప్రతి వీధి యందు తిరిగారు. గ్రామంలో గడప గడపకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది చిన్నలు పెద్దలు భక్తి భావంతో అందరూ దేవుని సేవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
సాయంత్రం హనుమాన్ దేవాలయంలో దీపాలు మహిళలు పెద్ద ఎత్తున హనుమాన్ మందిరంలో అలంకరణ చేశారు చండూరు గ్రామంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
