మంచిర్యాల జిల్లా.
ప్రపంచం మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మంచిర్యాల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ర్యాలీలు ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ దోమలు పెరగకుండా దోమలహాలు లేకుండా చేసుకొని దోమలు కుట్టకుండా చర్యలు చేపడతాము అదేవిధంగా మనకు సమయం ఆసన్నమైంది ఆవిష్కరణలను ఉపయోగించుకుందాం అనే నినాదంతో 2030 నాటికి దేశము నుండి రాష్ట్రము జిల్లా నుండి మలేరియా నిర్మూలనలో చర్యలు చేపడతాము అని తెలియజేసినారు అదేవిధంగా దోమలు గుడ్లను పెట్టకుండా నీటి నిల్వ ప్రదేశములను వారానికి ఒకసారి తీసివేయాలని ప్రతి వారంలో ఒకరోజు డ్రైవింగ్ పాటించాలని తర్వాత పెరిగిన దోమలను చంపడానికి కుట్టకుండా ఉండడానికి దోమతెరలను వాడాలని గుడ్డు నుండి లార్వాలు పెరిగి సమయంలోనే ఆంటీ చర్యలు చేపట్టుకోవాలని ఆదేశించినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2025 సంవత్సరంలో 23,375 మందికి పరీక్షలు చేయడం జరిగినదని అందులో ఒకరికి మాత్రమే మలేరియా నిర్ధారణ జరగడం అయినది మరియు మందులు తినిపించి చుట్టుపక్కల ఇండ్లలో దోమల మందు పిచికారి చేయడం జరిగినది అదేవిధంగా 2024 సంవత్సరంలో 1, లక్ష 7924 మందికి రక్త పరీక్షలు చేసి రెండు మలేరియా కేసులు మాత్రమే నిర్ధారణ జరిగినవి అన్ని కేసులు కూడా ఎలాంటి సమస్యలతో లేవు మందులతో నయం చేయడం జరిగినది జిల్లాలో కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం జరుగుచున్నది జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో దోమల మందు పిచికారి చేయడం జరిగినది అదేవిధంగా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని శాఖలతో పంచాయతీరాజ్ మున్సిపాలిటీ సంక్షేమ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ మొదలైన డిపార్ట్మెంటులతో సమన్వయం చేస్తూ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది అదేవిధంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రక్త పరీక్షలు చేయడానికి లాజిస్టిక్స్ అందుబాటులో ఉంచడం జరిగినది. కావున ప్రజలందరూ జాగ్రత్త పడాలని దోమలు పుట్టకుండా పుట్టకుండ పుట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరినారు జిల్లాలోని వైద్యాధికారులు వైద్య సిబ్బంది అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈరోజు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ఆశ ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో సందర్శించేటప్పుడు కీటక జనిత వ్యాధుల పైన దోమలు పుట్టకుండా పెరగకుండా తీసుకోవలసిన చర్యల పైన అవగాహన కలిగించాలని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ అనిత ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ శివప్రతాప్, డాక్టర్ అశోక్, డాక్టర్ సునీత, డాక్టర్ అమర్, డాక్టర్ రాము, డాక్టర్ రజిత, ఆర్ వి ఎస్ కే వైద్య సిబ్బంది నాందేవ్ జగదీష్ సబ్ యూనిట్ అధికారులు అల్లాడి శ్రీనివాస్ హెల్త్ ఎడ్యుకేషన్ మూర్తి కమ్యూనిటీ హెల్త్ అధికారి సుమన్ ఎప్పుడు మాలిస్ట్ పద్మ సంతోష్ మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ మరియు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి పాల్గొన్నారు.





