శ్రీరంగాపూర్ జనవరి 5 :శ్రీరంగాపూర్ మండలం లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దేవని చంద్రయ్య జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు శ్రీరంగాపూర్ జడ్పిటిసి ఎం రాజేంద్రప్రసాద్ యాదవ్ . మరియు గోవిందు రామచంద్రయ్య,యువ నాయకుడు గంగాధర్ యాదవ్, ఎల్ఐ సి రాజు తోట రవి శీను కుర్మయ్య వడ్డే సూరి అంజి కుమార్ తుదపరి నాయకులు రావడం జరిగింది. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల క్రీడాకారులు మరియు హనుమాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.