సత్తుపల్లి జనవరి 5:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే…
సత్తుపల్లి మండలం-రేజర్ల గ్రామంలో ప్రభుత్వ నిధులు సుమారు 46లక్షలు రూపాయి లతో సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రేజర్ల గ్రామ ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించే దానిలో మీ గ్రామంలో మాకు మంచి మెజార్టీ ఇచ్చారు,రేజర్ల గ్రామ ప్రజలకు మా ధన్యవాదాలు,మేము మాట ఇచ్చిన ప్రకారం రేజర్ల గ్రామాన్ని మోడ్రన్ విలేజ్ చేస్తాం, రాబొయ్యే రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు చేస్తాం,ప్రతి ఒక్కరు మన పార్టీ కోసం కష్ట పడిన ప్రతి ఒక్కరినీ మేము గుర్తు పెట్టుకుంటాం మీకు ఏ అవసరం వచ్చిన మా ఇంటి తలుపులు 24గంటలకు తెరిచే ఉంటాయి మేము పాలకులం కాదు మీసేవకులం అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ,గ్రామ సర్పంచ్ జక్కుల ప్రభాకరరావు ,వైస్ సర్పంచ్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి ,ఎంపీపీ దొడ్డా హైమావతి ,మండల కాంగ్రెస్ నాయుకులు,కార్యకర్తలు, గ్రామ నాయకులు,ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.




