రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలి…
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…
(తిమ్మాపూర్ డిసెంబర్ 31)
లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ ఆయకట్టు పరిదిలోని పంటలకు నీటిని విడుదల చేసిన బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కన్నంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
రైతులకు యాసంగి పంటలకు నీళ్ళు అందించటానికి మానేరు నుండి నీటిని విడుదళ చేస్తున్నామన్నారు. వరి పంట మీద ఆధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు . ఆరు తడి పంటలు వేసి ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు తీసుకోవాలని కోరారు.రైతులకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా ప్రభుత్వం ఉంటుందని ప్రజా పాలనలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆరు గ్యారంటీ అప్లికేషన్ లో మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి అని అన్నారు. అధికారం లోకి వచ్చిన 48 గంటల్లో రెండు గ్యారంటీలు అమలు చేసామని పేర్కొన్నారు. మహిళలకు కొత్తగా 1080 బస్సులు తీసుకొస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే పెద్ద మనసు చేసుకొని సహకరించాలన్నారు..
ఇది ప్రజా ప్రభుత్వమని,ప్రజలు చెబితే వినే ప్రభుత్వం అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెక్రటేరియల్ లో పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చే అవకాశం లేకుండే,ఇప్పుడు అందరికి అనుమతి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే కచ్చితంగా అమలు చేసి తీరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల అధికారులు ఎస్ఈ కుమార్. వంశి కాళీబాస్, శ్రీనివాస్, వేణగోపాల్ అయిస్. తదితరులు పాలుగోన్నారు.