తిమ్మాపూర్ డిసెంబర్ 31
తిమ్మాపూర్ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బెల్లం చేరాలు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తిమ్మాపూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ గంజాయి తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని అన్నారు…
కరీంనగర్ ఎస్బి ఆఫీస్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
తిమ్మాపూర్ ఎస్సైగా విధులు నిర్వహించిన శీలం ప్రమోద్ రెడ్డి బదిలీపై విఆర్ ఆఫిస్ కి వేళ్లడంతో ఘనంగా వీడ్కోలు పలుకుతూ, ఎస్ఐ ని సన్మానించిన తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు