గజ్వేల్ డిసెంబర్ 30 :తెలంగాణలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల బ్రోచర్ను ప్రారంభించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో 49వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీల కరపత్రాన్ని విడుదల చేసిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, జనవరి 11 నుండి 14 వరకు 33 జిల్లాల టీముల నుండి 1000 మంది క్రీడాకారులు, 100 మంది స్టేట్ మరియు నేషనల్ కబడ్డీ అఫీషియల్స్ పాల్గొనడం జరుగుతుంది.
ఈ నాలుగు రోజులలో 144 మ్యాచ్ లు సింథటిక్ మ్యాట్ పైన అంగరంగ వైభవంగా జరుగుతాయని సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, వైస్ చైర్మన్ జుబేర్ పాష, ఉమెన్స్ కమిషన్ చైర్మన్ దండుగుల రాజ్యలక్ష్మి, అధ్యక్షులు నేతి చిన్న సంతోష్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షులు సంపంగి రాజు, ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, కోశాధికారి కుంట సత్యం, సంయుక్త కార్యదర్షులు చెల్లి మహేష్, చొప్పరి శ్రీకాంత్ మరియు లింగని రాజు తదితరులు పాల్గొన్నారు.