క్రీడలు

అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్

206 Views

అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత ప్రగతి స్టేడియం 11 జట్టు.

రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా గత డిసెంబర్ 25 న ప్రారంభం అయిన 6 వ విడత అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 44 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనగా మంచిర్యాల కు చెందిన RCC-B 11 జట్టు మరియు శ్రీరాంపూర్ కు చెందిన ప్రగతి స్టేడియం 11 జట్టు ఫైనల్ కు చేరడం జరిగింది.

ఈరోజు ఫైనల్ మ్యాచ్ RCC-B 11 జట్టు మరియు ప్రగతి స్టేడియం 11 జట్టు మధ్య జరగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రగతి స్టేడియం 11 జట్టు ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు ముఖ్య అతిథిగా హాజరై విన్నర్ మరియు రన్నర్స్ కు ట్రోఫీ మరియు క్యాష్ ప్రైజ్ అందించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన ప్రగతి స్టేడియం 11 జట్టుకు 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు రన్నర్ గా నిలిచిన RCC -B జట్టుకు 5000 రూపాయల క్యాష్ ప్రైజ్ రఘునాథ్  అందించడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా రంజిత్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ప్రదీప్ లు నిలిచారు.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశం తో ప్రతి ఏడాది క్రికెట్ మరియు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువకులు చదువు తో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజినిష్ జైన్, బీయ్యాల సతీష్ రావు, బోయినీ హారి కృష్ణ, రాకేష్ రేన్వ, రెడ్డిమళ్ళ అశోక్, బొద్దున మల్లేష్, ముదాం మల్లేష్, పల్లి రాకేష్ మరియు తతిదరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *