దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్( ‘రౌద్రం.. రణం.. రుధిరం’).రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.




