(శంకరపట్నం డిసెంబర్ 16)
శంకరపట్నం మండలం తాడికల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున కారును డీ కొన్న లారీ,కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి,మరో ఇద్దరికి తీవ్ర గాయలు.
జెసిబి సహాయంతో మృత దేహాలను బయటకు తీసిన పోలీసులు,ఇద్దరి మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. గాయపడిన వ్యక్తులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది..
మృతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు…