– కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము
(తిమ్మాపూర్ డిసెంబర్ 16)
తిమ్మాపూర్ లోని సర్వేనెంబర్ 265 లో ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి నెంబర్ కేటాయించే విషయంలో తిమ్మాపూర్ కార్యదర్శి కే మహేందర్ రావు స్పందించారు.
శనివారం గ్రామంలోని 265 సర్వే నెంబర్ లో నిర్మించిన ఇండ్లను ఆయన గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి పరిశీలించారు. ఏళ్ల తరబడి ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఇంటి నెంబర్ లేక కరెంటు మీటర్ లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, నగునూరి శ్రీనివాస్ లు ఇటీవల పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే..
ఈ విషయ పై స్పందించిన పంచాయతీ కార్యదర్శి శనివారం ఆ ఇండ్లను పరిశీలించి ఇంటి నెంబర్ కేటాయింపు విషయమై విచారణ జరిపారు.
ఇంటి నెంబర్ కేటాయింపు విషయంలో చొరవ చూపిన పోలు రాముకు, కార్యదర్శికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు..