రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం నర్సింలు పల్లెకు చెందిన డ్యాగ తిరుపతి, డ్యాగ కనకయ్యల మధ్య భూ విహాదం ఉన్నది. గురువారం అదే భూములో మాట మాట పెరిగి తిరుపతికి వరుసకు కు తమ్ముడు అయినటువంటి రాకేష్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
