Breaking News

మళ్లీ ఐటి సోదాలు

268 Views

హైదరాబాద్‌లో మళ్లీ ఐటి సోదాలు

హైదరాబాద్:అక్టోబర్ 05

హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు 100 టీములతో సోదాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

అలాగే జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘ్‌వీర్‌ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *