Breaking News

ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు 

102 Views

ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు

హైదరాబాద్:ఆగస్టు 31న
నకిలీ హామీలు వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాలు పని అంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారంటూ మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే వచ్చి పేపర్ పై రాసిచ్చిన హామీలు చదివి వెళ్లిన వారికి రాష్ట్రంపై ఎలాంటి అవగాహన లేదని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సవాల్ విసిరారు వైద్యారోగ్య రంగంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచామని భారతదేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు కేవలం తెలంగాణ రాష్ట్రానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు.

ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ వస్తుందని హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *