మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్
డిసెంబర్ 06
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని ఎస్పీ కే.సురేష్ కుమార్ తెలిపారు. మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవీటిజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన కార్యక్రమాల ద్వారా జిల్లాలో అవగాహన కల్పించామన్నారు.
జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలలో షీటీంకు ఒక్క పిర్యాదు నమోదు చేశామని, అలాగే 39 హాట్ స్పాట్స్ విసిట్ చేస్తూ,06 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్దిని విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. తద్వారా విద్యార్థిని వేధించిన ఒక వ్యక్తి ని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు.
మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసు కోవాలని సూచించారు. నేరుగా సంప్రదించండి 87126 70564, లేదా డయల్ 100కు సమాచారం. అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు
